Share News

మలేషియా మోడల్‌పై ఏపీ ఫోకస్.. బుకిత్ తగర్‌లో నారాయణ పర్యటన

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:16 PM

మలేషియాలో ఏపీ మంత్రి నారాయణ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మలేషియాలో ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ పద్ధతులను మంత్రి అధ్యయనం చేస్తున్నారు.

మలేషియా మోడల్‌పై ఏపీ ఫోకస్.. బుకిత్ తగర్‌లో నారాయణ పర్యటన
Narayana Malaysia visit

మలేషియా/అమరావతి, జూన్ 19: మలేషియాలో ఏపీ మంత్రి నారాయణ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మలేషియాలో ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ పద్ధతులను మంత్రి అధ్యయనం చేస్తున్నారు. సెలాంగోర్ రాష్ట్రంలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్‌ను సందర్శించారు. మలేషియాలో అతిపెద్ద శానిటరీ ల్యాండ్ ఫీలింగ్ ప్రాంతంగా బుకిత్ తగర్ పేరొందింది. ఘన వ్యర్థాలను పర్యావరణానికి హాని లేకుండా శాస్త్రీయ పద్ధతిలో పూడ్చిపెట్టే విధానాన్ని మంత్రి అధ్యయనం చేశారు.


భూమి, నీరు కలుషితం కాకుండా వ్యర్థాల నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారో మంత్రికి అధికారులు వివరించారు. ఈరోజు(శుక్రవారం) సాయంత్రం బెర్జయ గ్రూప్ నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. బెర్జయ గ్రూప్.. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలా ఇళ్లను నిర్మిస్తోంది. అలాగే సాయంత్రం సన్ వే, గముడా ప్రాజెక్టుల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశంకానున్నారు.


ఇవి కూడా చదవండి...

శరీరాకృతి కోసం స్టెరాయిడ్ల వినియోగం.. జిమ్‌లలో పోలీసుల ముమ్మర తనిఖీలు

‘ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలకు లోకేశ్ ఆహ్వానం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 12:54 PM