Share News

వాన్‌‌పిక్‌ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:38 PM

వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈడీ జప్తు చేసిన వాన్‌పిక్ ఆస్తులను విడుదల చేయాలని గతంలో ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

వాన్‌‌పిక్‌ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్
Telangana High Court

హైదరాబాద్, జూన్ 19: వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి(ఈడీ) తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్‌పిక్‌ ఆస్తుల విడుదలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన వాన్‌పిక్ ఆస్తులను విడుదల చేయాలని గతంలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ ఆదేశాలను హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈ వ్యవహారంలో క్విడ్-ప్రోకో జరిగిందని ఈడీ వాదనలు వినిపించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులపై స్టే విధించాలని హైకోర్టును కోరింది.


ఈ ఆస్తులు.. ఎలాంటి ముడుపులు, నేరపూరిత రాబడుల ద్వారా సంపాదించినవి కావని వాన్‌పిక్‌ తరఫున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రారంభంలో ఈడీ జారీ చేసిన తాత్కాలిక అటాచ్‌మెంట్ ఉత్తర్వులు సరైనవి కావని పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఈడీ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.


ఇవి కూడా చదవండి...

శరీరాకృతి కోసం స్టెరాయిడ్ల వినియోగం.. జిమ్‌లలో పోలీసుల ముమ్మర తనిఖీలు

హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 01:07 PM