Share News

వైభవ్ టెస్టు క్రికెట్ ఆడాలి: రవిచంద్రన్ అశ్విన్

ABN , Publish Date - Jun 05 , 2026 | 08:52 PM

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు.

వైభవ్ టెస్టు క్రికెట్ ఆడాలి: రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు.. ఈ సీజన్‌లో ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి భవిష్యత్తుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు.


‘వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్ ఆడాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆట గురించి విస్తృతంగా ఆలోచిస్తుంటే మాత్రం అతడు తప్పనిసరిగా సుదీర్ఘ ఫార్మాట్ ఆడాలి. అయితే నేర్చుకోవడానికి ఇష్టపడని విషయాలను మీరు మీ పిల్లలకు నేర్పించగలరా? అస్సలు నేర్పించలేరు. ఈ విషయాలన్నింటినీ పరిస్థితులే నడిపిస్తాయని నేను భావిస్తున్నా. కొన్నిసార్లు ఏం చేయాలో ఆట మీకు చెప్పినప్పుడు, అది చెప్పినట్లు చేయడమే ఉత్తమం. ప్రస్తుతం యువ క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో రావడం చాలా అరుదుగా కనిపిస్తోంది. రెంు బంతులు డిఫెన్స్ చేసిన వెంటనే కష్ట పరిస్థితుల నుంచి బయటపడే షాట్లు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది’ అని అశ్విన్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్!

మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!

Updated Date - Jun 05 , 2026 | 08:52 PM