Home » IPL
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. టోర్నీలో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఈ సీజన్‌లో కొందరు ప్లేయర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై హెచ్‌సీఏ, మల్కాజ్‌గిరి స్పెషల్ బ్రాంచ్, ఎస్‌ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసుల అదుపులో ఐపీఎల్ టికెట్ల విక్రయ ముఠా ఉంది.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్‌కు 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే ఛేదించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో భారీ మార్పులు జరిగాయి. ఆ ఫ్రాంచైజీని ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలా సొంతం చేసుకున్నారు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు తడబడ్డారు. 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ జితేశ్ శర్మ.. వైభవ్ సూర్యవంశీ అన్‌ప్రొఫెషనల్ క్రికెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేశ్ తాజాగా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో వివరించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్ కార్తిక్ శర్మ.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత చేసిన గన్ షాట్ సెలబ్రేషన్స్ గురించి మ్యాచ్ అనంతరం కార్తిక్ వివరించాడు.