ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
ABN , Publish Date - May 05 , 2026 | 07:19 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు కూడా సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని దూరమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీపై సీఎస్కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన సీఎస్కే రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో 9 మ్యాచుల్లో నాలుగింట్లో గెలిచిన సీఎస్కే ఆరో స్థానంలో ఉండగా, అన్నే మ్యాచులు ఆడిన ఢిల్లీ ఏడో స్థానంలో ఉంది.
సీఎస్కే తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రెవిస్, ఓవర్టన్, అకీల్ హుసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి, గుర్జాప్‌నీత్ సింగ్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: శివం దూబె, ప్రశాంత్ వీర్, మ్యాథ్యూ షార్ట్, ఆకాశ్ మధ్వాల్, సర్ఫరాజ్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
అక్షర్ పటేల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిశాంక, కరుణ్ నాయర్, స్టబ్స్, నితీశ్ రాణా, అశుతోశ్ శర్మ, లుంగి ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, టి.నటరాజన్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: విప్రాజ్ నిగమ్, సమీర్ రిజ్వి, అభిషేక్ పొరెల్, ఆకిబ్ నబీ దార్, డేవిడ్ మిల్లర్
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్