ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే టీమిండియా
ABN , Publish Date - May 05 , 2026 | 05:04 PM
టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు సార్లు, మొత్తంగా మూడుసార్లు ఈ ట్రోఫీని అందుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ర్యాంకింగ్స్ జాబితాలో 275 రేటింగ్ పాయింట్లతో సత్తా చాటింది.
టీమిండియా తర్వాత ఇంగ్లండ్ జట్టు 262 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా(258), న్యూజిలాండ్(247) పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే టాప్ 7 జట్లలో ఎలాంటి మార్పులు జరగలేదు. సౌతాఫ్రికా(244), పాకిస్థాన్(240), వెస్టిండీస్(233) పాయింట్లతో తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026లో పేలవ ప్రదర్శన కనబర్చిన శ్రీలంక జట్టు.. ఆరు పాయింట్లు కోల్పోయి 9వ స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉంటే, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రాణించిన బంగ్లాదేశ్(225) 8వ స్థానానికి ఎగబాకింది. అఫ్గానిస్తాన్(220) తన పదో స్థానాన్ని పదిలపర్చుకుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసి.. ప్రపంచ మేటి జట్లకు గట్టి పోటీనిచ్చిన అమెరికా రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకోవడం విశేషం. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లు వరుసగా 14, 15వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్