లఖ్‌నవూ మ్యాచ్‌లో హార్దిక్ ఆడకపోవడానికి కారణం అదే: రికెల్టన్
ABN , Publish Date - May 05 , 2026 | 02:50 PM
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరే ఈ వైఫల్యానికి కారణమని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హార్దిక్ దూరం కావడం హాట్ టాపిక్‌గా మారింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరే ఈ వైఫల్యానికి కారణమని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న( సోమవారం) లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌కు హార్దిక్ దూరం కావడం హాట్ టాపిక్‌గా మారింది. టాస్ వేయడానికి ముందు వరకు కూడా హార్దిక్ ఆడతాడని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా సూర్యకుమార్ యాదవ్ టాస్ కోసం గ్రౌండ్‌లోకి రావడంతో అభిమానులంతా షాకయ్యారు. అయితే లఖ్‌నవూతో మ్యాచ్‌కు హార్దిక్ ఎందుకు దూరమయ్యాడనే విషయాన్ని ముంబై ఓపెనర్ రికెల్టన్ వెల్లడించాడు.
రికెల్టన్ మీడియాతో మాట్లాడుతూ.. 'వెన్ను, కండరాల నొప్పులతో బాధపడుతున్నందువల్ల లఖ్‌నవూతో మ్యాచ్‌కు హార్దిక్ దూరమయ్యాడు. అతడు మళ్లీ ఎప్పుడు ఆడతాడు అనే విషయం నాకు తెలియదు. అతనికి వెన్ను కండరాల నొప్పులు ఉన్నాయని మ్యాచ్‌కి కాసేపు ముందే నాకు తెలిసింది. అతడి గాయం తీవ్రతకు సంబంధించి పూర్తి సమాచారం నా దగ్గర లేదు. ప్రస్తుతం అతనికి ఎలా వుందో కూడా నాకు కచ్చితంగా తెలియదు. కానీ, ఆర్సీబీతో సమయానికి హార్దిక్ కోలుకుని మాతో వస్తాడని నమ్మకంగా చెప్పగలను’ అని రికెల్టన్ తెలిపాడు.
అలానే రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడంపై రికెల్టన్ సంతోషం వ్యక్తంచేశాడు. రోహిత్ అద్భుతమైన ఆటగాడని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపాడు. రోహిత్‌తో కలిసి మళ్లీ క్రీజులోకి వెళ్లడం చాలా సంతోషంగా అనిపించిందని, రీ ఎంట్రీలో అంత స్వేచ్ఛగా, అలవోకగా ఆడిన తీరు నిజంగా చాలా ప్రత్యేకమైనదని రికెల్టన్ వెల్లడించాడు. రోహిత్ ఆడిన కొన్ని షాట్లను కలలో కూడా ఊహించలేనని రికెల్టన్ వివరించాడు.
మే 10న రాయ్‌పూర్‌లో ఆర్సీబీతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడు ఓడగా.. కేవలం మూడు మ్యాచుల్లో ముంబై విజయం సాధించింది. నిన్న లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌కు ముంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. అంతేకాక ఎల్ఎస్‌జీ బౌలర్లపై విరుచుకుపడి.. 44 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులతో చెలరేగిపోయాడు.
ఇవి కూడా చదవండి:
ముంబై చేతిలో ఓటమిపై స్పందించిన పంత్..
జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?