Share News

బెంగాల్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా, అస్సాంకు జేపీ నడ్డా

ABN , Publish Date - May 05 , 2026 | 02:35 PM

పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్ర నాయకత్వం సన్నాహాలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను బీజేపీ మంగళవారంనాడు నియమించింది.

బెంగాల్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా, అస్సాంకు జేపీ నడ్డా
Amit Shah and JP Nadda

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్ర నాయకత్వం సన్నాహాలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను మంగళవారంనాడు నియమించింది. బీహార్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కేంద్ర పరిశీలకునిగా నియమితులయ్యారు. కో-అబ్జర్వర్‌గా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వ్యవహరిస్తారు. బెంగాల్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎంపికను కేంద్ర పరిశీలకులు పర్యవేక్షిస్తారు. దీంతో ముఖ్యమంత్రి ఎన్నికకు, ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది. మే 9న బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుంది.


కాగా, అస్సాంకు కేంద్ర పరిశీలకుడిగా బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. ఆయనకు అసోసియేట్‌గా హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ వ్యవహరిస్తారు. అస్సాంలో లెజిస్లేచర్ పార్టీ నేత ఎంపికను వీరు పర్యవేక్షిస్తారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ 207 సీట్లు గెలుచుకుని పూర్తి మెజారిటీని సాధించగా, అస్సాంలో 82 సీట్లతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.


ఇవి కూడా చదవండి..

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..

టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ నేతల సంబరాలు.. రాహుల్ గాంధీ ఆగ్రహం

Updated Date - May 05 , 2026 | 02:44 PM