Share News

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..

ABN , Publish Date - May 05 , 2026 | 10:41 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఎక్కువ సీట్లు సాధించి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం టీవీకేకు రాలేదు.

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..
Vijay TVK government formation

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఎక్కువ సీట్లు సాధించి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం టీవీకేకు రాలేదు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం కాగా, విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది (Vijay TVK government formation).


ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్, గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని గవర్నర్‌కు రాసిన లేఖలో విజయ్ పేర్కొన్నట్టు సమాచారం. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్‌కు మరో పది సీట్లు అవసరం. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును ఏ కూటమి నుంచి కూడగట్టాలా అని టీవీకే నేతలు చర్చించుకుంటున్నారు (Vijay governor meeting).


విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, పీఎంకే సిద్ధంగా ఉన్నాయి (Tamil Nadu hung assembly). అయితే ఆ రెండు పార్టీలు చెరో రెండు మంత్రి పదవులను ఆశిస్తున్నాయట. ఇప్పటికే విజయ్‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకే నేతలతో చర్చలు జరుపుతున్నాయట. మద్దతు ఇవ్వడానికి సిద్ధమనే సంకేతాలు పంపించాయట. ఈ నేపథ్యంలో విజయ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..


కమల్ హాసన్, రజనీకాంత్‌కు సాధ్యం కానిది.. విజయ్‌కు ఎలా సాధ్యమైంది?

Updated Date - May 05 , 2026 | 11:21 AM