Share News

వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. కాసేపు లాక్‌డౌన్..

ABN , Publish Date - May 05 , 2026 | 09:06 AM

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. వైట్‌హౌస్ సమీపంలో భద్రతా బలగాలపై ఓ సాయుధుడు కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల ఘటన కారణంగా కొద్దిసేపు వైట్‌హౌస్‌ను మూసేశారు.

వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. కాసేపు లాక్‌డౌన్..
White House shooting 2026

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. వైట్‌హౌస్ సమీపంలో భద్రతా బలగాలపై ఓ సాయుధుడు కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల ఘటన కారణంగా కొద్దిసేపు వైట్‌హౌస్‌ను మూసేశారు. మీడియా సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పరిసర ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు (White House shooting 2026).


ఈ కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటికి ముందే ఆ రోడ్డులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ వెళ్లింది (Armed suspect White House). ఆ కాల్పులు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. కాగా, ఈ దాడి నేరుగా వైట్‌హౌస్‌ను టార్గెట్ చేసింది కాదని అధికారులు భావిస్తున్నారు.


ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఒక అనుమానితుడిపై కాల్పులు జరిపారు (US security alert). గాయపడిన అనుమానితుడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.1.5 లక్షల మార్క్ దిగువకు బంగారం ధరలు..


కమల్ హాసన్, రజనీకాంత్‌కు సాధ్యం కానిది.. విజయ్‌కు ఎలా సాధ్యమైంది?

Updated Date - May 05 , 2026 | 10:29 AM