ఐపీఎల్ 2026: ముంబై చేతిలో ఓటమిపై స్పందించిన పంత్..
ABN , Publish Date - May 05 , 2026 | 11:40 AM
ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. నిన్న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమిపై లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. నిన్న(సోమవారం) వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 228 పరుగుల భారీ స్కోరు చేసినా లఖ్‌నవూ విజయం సాధించలేకపోయింది. ముంబై చేతిలో ఓడిపోవడంపై లఖ్‌నవూ కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు. ఆరంభంలోనే ధాటిగా ఆడినప్పటికీ.. చివర్లలో కొన్ని పరుగులు తక్కువగా చేశామని పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'మేము ప్రారంభించిన ఇన్నింగ్స్ తీరు చూస్తే ఇంకా ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సింది.ఈ మ్యాచ్ ప్రారంభంలో మాకు కొన్ని మంచి సంకేతాలు కనిపించాయి. మా కుర్రాళ్లు స్వేచ్ఛగా ఆడారు. కానీ, చివర్లో ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎందుకంటే వాళ్లకి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అలవాటు. ఈ పిచ్‌పై 220-230 పరుగులు ఈజీగా చేయొచ్చు. మేము10-15 పరుగులు తక్కువ చేశాం' అని తెలిపాడు.
'మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. మా ఓటమికి వారిని కారణంగా చూపలేను. మా జట్టుకు కాస్త అదృష్టం కూడా తోడు కావాలి. నేను చెప్పదలుచుకున్న ఏకైక విషయం ఇదే. అదృష్టం కలిసి రావాలంటే దైవానుగ్రహం ఉండాలి. కొంచెం అదృష్టం కలిసివస్తే మా జట్టు పరిస్థితులు అనుకూలిస్తాయని, చివరి నిమిషంలో పుంజుకుంటాము. అలానే గెలుపు కోసం మా వైపు నుంచి కూడా మరింత కృషి అవసరం’ అని పంత్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
రోహిత్ శర్మను అనుసరించిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?