రోహిత్ శర్మను అనుసరించిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
ABN , Publish Date - May 05 , 2026 | 10:59 AM
పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఇటీవలే ఫామ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్-2026లో ఇటీవల సెంచరీలతో చెలరేగి ఆడాడు. అంతేకాక పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలానే తాజాగా అతడి కల నెరవేరింది.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఇటీవలే ఫామ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్-2026లో ఇటీవల సెంచరీలతో చెలరేగి ఆడాడు. అంతేకాక పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలానే తాజాగా అతడి కల నెరవేరింది. బాబర్ సారథ్యంలో పెషావర్ జెల్మీ జట్టు పీఎస్ఎల్- 2026 టైటిల్ గెలిచింది. హైదరాబాద్ కింగ్స్ మెన్‌తో ఆదివారం జరిగిన పోరులో పెషావర్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే.. టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను అనుసరిస్తూ.. బాబర్ తన పరువు తానే తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెషావర్ జెల్మీ జట్టు తొలిసారి పీఎస్‌ఎల్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు 18 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ దిగిన పెషావర్ జట్టు 15.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజం.. ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆరోన్ హార్డీ (39 బంతుల్లో 56 నాటౌట్), అబ్దుల్ సమద్ (34 బంతుల్లో 48) రాణించి జట్టును గెలిపించారు. దీంతో తొలిసారి పీఎస్‌ఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో బాబర్ ఆజం ఎగిరి గంతేశాడు.
ఇంతవరకు బాగానే ఉన్నా... ట్రోఫీ అందుకునే సమయంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ శైలిని అనుకరించబోయి నెటిజన్ల చేతికి చిక్కాడు. 2024లో టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపిన సారథి రోహిత్.. రోబో మాదిరి నడుచుకుంటూ వెళ్లి ట్రోఫీ అందుకుని సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బాబర్ కూడా అదే స్టైల్‌లో వెళ్లి ట్రోఫీ తీసుకోవాలనుకున్నాడు. కానీ రోబో మాదిరి కాకుండా వెనుక నుంచి ఎవరో తరిమినట్లుగా చిన్న పిల్లాడిలా పరిగెత్తుకు వెళ్లి ట్రోఫీ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రోహిత్ శర్మను కాపీ కొట్టబోయి బొక్కబోర్లా పడ్డాడటూ బాబర్ ఆజంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
జస్ప్రీత్ బుమ్రాపై సునీల్ గావస్కర్ ఆగ్రహం.. ఎందుకంటే?
చారిత్రక సిరీస్‌లో పసికూనపై పాకిస్థాన్ ప్రతాపం