బుమ్రా పేలవ ప్రదర్శనకు వర్క్‌లోడ్ కారణం: రవి శాస్త్రి
ABN , Publish Date - May 05 , 2026 | 08:53 PM
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 వికెట్లే తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఆటతీరుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 వికెట్లే తీసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతిని అందుకుని అద్భుతం చేసే బుమ్రా.. ఇప్పుడు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాల్సిన బుమ్రా.. ఇప్పుడు ఎంఐ ఓటమికి కారణమవుతున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఆటతీరుపై టీమిండియా దిగ్గజం రవి శాస్త్రి స్పందించాడు.
‘బుమ్రా ఇలాంటి ప్రదర్శన చేయడానికి కేవలం ఫిట్‌నెస్ మాత్రమే కారణం కాదు. అతడు గత ఏడాది కాలంగా భారత జట్టులో వరుస సిరీస్‌లు, ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ వంటి టోర్నీల్లో విరామం లేకుండా ఆడుతూ వచ్చాడు. ఈ షెడ్యూల్ వల్ల బుమ్రా శారీరకంగానే కాదు మానసికంగానూ అలసిపోయాడు. ఆ అలసటతోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అతడి పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణం.. వర్క్‌లోడ్. ముంబై ఇండియన్స్ బుమ్రా పట్ల కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజులు విరామం తీసుకుని బరిలోకి దిగితే బుమ్రా తన ఫామ్‌ను తిరిగి పొందుతాడు’ అని రవి శాస్త్రి వెల్లడించాడు.
ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎంఐ విజయాల కోసం శ్రమిస్తోంది. ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఎంఐ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్