ఐపీఎల్ 2026: తేలిపోయిన ఢిల్లీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు స్వల్ప లక్ష్యం
ABN , Publish Date - May 05 , 2026 | 09:20 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. సీఎస్కేకి 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. సీఎస్కేకి 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వి(40*), స్టబ్స్(38) రాణించారు. మిగతా బ్యాటర్లంతా స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు.
సమీర్ రిజ్వి(40*; 24 బంతుల్లో 4 సిక్సర్లు), స్టబ్స్(38; 31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. వీరిద్దరూ కలిసి 47 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాతుమ్ నిశాంక(19), కేఎల్ రాహుల్(12), నితీశ్ రాణా(15), కరుణ్ నాయర్(13), అక్షర్ పటేల్(2), అశుతోశ్ శర్మ(14) వెనువెంటనే ఔటయ్యారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 2, అకీల్ 1, ముకేశ్ చౌదరి 1, గుర్జాప్‌నీత్ సింగ్ 1, ఓవర్టన్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్