• Home » IPL

IPL

ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్

ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్

ఢిల్లీలోని వసంత్ విహార్‌ ప్రాంతంలో బీడీఆర్ బిల్డర్స్ ఆస్తి వివాదానికి సంబంధించి వచ్చిన కథనాల్లో తనను తప్పుగా గుర్తించడంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో ఉన్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు.

ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు ధోని ఆసక్తి.. నిరాకరించిన సీఎస్కే?

ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు ధోని ఆసక్తి.. నిరాకరించిన సీఎస్కే?

ధోని–సీఎస్కే బంధంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సీఎస్కేలో వాటా కొనుగోలు చేయాలని ధోని భావించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ధోని, సీఎస్కే యాజమాన్యం మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చలు విఫలమైనట్లు వార్తలు వస్తున్నాయి.

సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ సరైనోడు: మాథ్యూ హేడెన్

సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్ సరైనోడు: మాథ్యూ హేడెన్

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ఈ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి సంబంధించి క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో..

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు కర్ణ్ శర్మ వీడ్కోలు

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు కర్ణ్ శర్మ వీడ్కోలు

టీమిండియా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల కర్ణ్ శర్మ.. యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్, మీరట్ మావెరిక్స్ మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ కీలక అధికారి, భారత మాజీ క్రికెటర్ జుబిన్‌ భారుచాను తమతో కలుపుకుంది.

మరో లీగ్‌లోకి నైట్ రైడర్స్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ ప్లాన్ అదేనా?

మరో లీగ్‌లోకి నైట్ రైడర్స్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ ప్లాన్ అదేనా?

బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారుక్ ఖాన్‌కు చెందిన నైట్ రైడర్స్ గ్రూప్ (KRG) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భువీని టీమిండియాలోకి తిరిగి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలు సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్ బెంగళూరులోని జస్ట్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో కనిపించడంతో ఈ చర్చ మొదలైంది.

హార్దిక్‌ను ట్రేడ్ చేస్తే.. ఆ ఇద్దరినీ జట్టులోకి తీసుకోండి.. ఎంఐకి అశ్విన్ సూచన

హార్దిక్‌ను ట్రేడ్ చేస్తే.. ఆ ఇద్దరినీ జట్టులోకి తీసుకోండి.. ఎంఐకి అశ్విన్ సూచన

హార్దిక్‌ పాండ్యను చెన్నై సూపర్ కింగ్స్ లేదా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు పంపేందుకు ఎంఐ ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

కొన్నేళ్లుగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై ఎట్టకేలకు స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన పుకార్లపై స్పష్టతనిచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి