Bangladesh Cricket Board: ఆ అంపైర్ మా కాంట్రాక్ట్‌లో లేడు.. స్పష్టం చేసిన బీసీబీ అధికారి
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:14 PM
ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై బీసీబీ తాజాగా స్పందించింది. అతడికి బీసీబీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత బంగ్లా ప్రభుత్వం, బంగ్లా క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) ఈ విషయంపై తీవ్రంగా స్పందించాయి. రానున్న టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌లో బంగ్లా ఆడాల్సిన మ్యాచుల వేదికలు శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీకి మెయిల్ చేసింది. ‘భద్రతా కారణాల వల్లే ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేసినప్పుడు.. మా ఆటగాళ్లకు భారత్‌లో భద్రత ఉంటుందని మేమెలా అనుకుంటాం’ అని బీసీబీ అధ్యక్షుడు గతంలో వ్యాఖ్యానించాడు. అయితే మ్యాచుల తరలింపుపై ఐసీసీ(ICC) ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
ఇదిలా ఉండగా.. ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై బీసీబీ(BCB) తాజాగా స్పందించింది. ‘సైకత్.. ఐసీసీ కాంట్రాక్ట్‌లో ఉన్న అంపైర్. అతడు బీసీబీ కాంట్రాక్ట్‌లో లేడు. ఐసీసీ విధుల్లో ఉన్నందున ఆ అంపైర్‌కు బీసీబీ అబ్జెక్షన్ సర్టిఫికెట్‌తో (ఎన్‌ఓసీ) పనిలేదు’ అని అంపైర్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ ఇఫ్తెకర్ రెహమాన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?
నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా