Irfan Pathan: విరాట్ నిలకడకు మరో పేరు.. ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:36 PM
ఆదివారం వడోదర వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ తన సూపర్ నాక్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా విరాట్ నిలకడ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో వన్డేలో తొలుత ఓ సెంచరీ చేసిన విరాట్.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో వన్డేలో వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి మ్యాచులో అద్భుతమైన నిలకడ ప్రదర్శిస్తూ చెలరేగి ఆడుతున్నాడు. ఆదివారం వడోదర వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ తన సూపర్ నాక్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా విరాట్ నిలకడ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) స్పందించాడు.
‘విరాట్ కోహ్లీ(Virat Kohli) నిలకడకు మరో పేరు. తన చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతడు ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. అలాగే నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 28వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అతడి కంటే ముందు కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఉన్నాడు. 37 సంవత్సరాల వయసులో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం విరాట్‌కే చెల్లుతుంది. బ్యాటింగ్ సమయంలో అతడి హెడ్ పొజిషన్ బాగుంది. టెక్నిక్ కూడా చాలా బాగుంది. విరాట్.. తాను ఆడిన మొదటి 20 బంతుల్లో నాలుగు బౌండరీలు బాదాడు. కానీ తర్వాత 50 బంతులకు ఒక్క బౌండరీయే కొట్టాడు. అతడు సెంచరీ చేస్తే బాగుండేది. కానీ తృటిలో మిస్ అయ్యాడు’ అని ఇర్ఫాన్.. కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఇవి కూడా చదవండి:
సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?
నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా