Share News

IPL 2026: అఫీషియల్.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:20 PM

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ జట్టు ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌లో ఆడించొద్దంటూ డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ వెంటనే అతడిని జట్టులోంచి రిలీజ్ చేయాలంటూ కేకేఆర్‌ను ఆదేశించింది.

IPL 2026: అఫీషియల్.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ జట్టు ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌లో ఆడించొద్దంటూ డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ వెంటనే అతడిని జట్టులోంచి రిలీజ్ చేయాలంటూ కేకేఆర్‌ను ఆదేశించింది. ఈ పరిణామం తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం, బంగ్లా క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించాయి. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026లో తమ జట్టు భారత్‌లో ఆడబోదని.. వేదికలు మార్చాలంటూ ఐసీసీకి లేఖ రాసింది.


ఈ క్రమంలో ఐపీఎల్(IPL 2026) ప్రసారాలపై నిషేధం విధించింది. ‘2026 మార్చి 26 నుంచి జరగనున్న ఐపీఎల్‌ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను మినహాయించడంపై బీసీసీఐ (BCCI) నుంచి ఒక ఆదేశం వెలువడిందని సమాచారం అందుతోంది. భారత క్రికెట్ బోర్డు అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి హేతుబద్ధమైన కారణం తెలియదు. అటువంటి నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను బాధించింది. ఈ పరిస్థితుల్లో.. తదుపరి నోటీసు వచ్చేవరకు ఐపీఎల్‌ ప్రసారాలను నిలిపివేయాలి’ అని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆ ఆదేశాల్లో పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?

జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384

Updated Date - Jan 05 , 2026 | 02:53 PM