The Ashes: ముగిసిన రెండో రోజు ఆట.. 218 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:22 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34.1 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా.. 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై ఇంకా 218 పరుగులు వెనుకంజలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34.1 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా.. 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై ఇంకా 218 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆట ముగిసేటప్పటికీ క్రీజులో మిచెల్ నెసర్(1), ట్రావిస్ హెడ్(91) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టో్క్స్‌కే రెండు వికెట్లు దక్కాయి.
అంతకు ముందు 211/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. 384 పరుగులకు ఆలౌటయ్యారు. జో రూట్(160) అద్భుత శతకంతో రాణించాడు. హ్యారీ బ్రూక్(84) ఆకట్టుకున్నాడు. జెమీ స్మిత్(46) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఆసీస్ బౌలర్లలో నెసర్‌కు 4, స్టార్క్, బోలాండ్ తలో రెండు, గ్రీన్, లుబుషేన్ చెరొక వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కి దిగిన ఆసీస్ ఆదిలో కాస్త తడబడింది. చకచకా స్కోరు చేయలేకపోయింది. జాక్ వెదర్లాండ్(21), లుబుషేన్(48)ను స్టోక్స్ స్వల్ప స్కోరుకే వెనక్కి పంపాడు. ట్రావిస్ హెడ్(91*) శతకానికి చేరువలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?
జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384