The Ashes: జో రూట్ అద్భుత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 384
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:06 AM
యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఐదో టెస్టు ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 211/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 384 పరుగులకు ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఐదో టెస్టులో తలపడుతున్నాయి. ఇప్పటికే 3-1తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లండ్.. ఈ టెస్టు(The Ashes)లో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఒకానొక దశలో 57/3తో కష్టాల్లో పడ్డ ఆ జట్టును.. జో రూట్(160), హ్యారీ బ్రూక్(84) ఆదుకున్నారు. వరుణుడు ఆటంకం కలిగించడంతో 211/3తో తొలిరోజు ఆటను ముగించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో రోజు 97.3 ఓవర్లలో 384 పరుగులు చేసి ఆలౌటైంది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(160) అద్భుత శతకంతో రాణించాడు. హ్యారీ బ్రూక్(84) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. జెమీ స్మిత్(46) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో రెండు, గ్రీన్, లుబుషేర్ చెరొక వికెట్ పడగొట్టారు.
రికీ పాంటింగ్ సరసన జో రూట్..
రూట్ అద్భుత సెంచరీతో దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. ఇది అతడికి 41వ సెంచరీ. రికీ పాంటింగ్ 168 మ్యాచుల్లో ఈ ఘనతను సాధిస్తే.. రూట్ 163 మ్యాచుల్లోనే సాధించడం విశేషం. అలాగే జో రూట్‌కు 2026 క్యాలెండర్ ఇయర్‌లో ఇదే మొదటి సెంచరీ. టెస్టుల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో అతడు మూడో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ జాక్వస్ కలీస్ (166 మ్యాచుల్లో 45 సెంచరీలు) ఉన్నాడు. మొదటి స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) (200 మ్యాచుల్లో 51 సెంచరీలు) ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
బంగ్లాదేశ్ కెప్టెన్‌గా హిందూ క్రికెటర్.. అసలెవరీ లిట్టన్ దాస్?
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా!