Home » Hyderabad
భాగ్యనగరంలోని ప్రముఖ హోటల్స్ యజమానుల ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.
ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతి కి గురయ్యారు.
హిజ్రాలు నిర్వహించిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మోనాలిసా అనే హిజ్రాల గ్యాంగ్ లీడర్ తమపై దాడి చేసిందంటూ పలువురు హిజ్రాలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని లైటర్‌తో నిప్పు అంటించుకుంటుండగా ఏడుగురికి గాయాలయ్యాయి.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు 4తులాల(40 గ్రాముల) బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలో సోమవారం పట్టపగలే జరిగింది.
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని అభివర్ణించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
శంషాబాద్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సెకండ్ ఇయర్ విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
క్యాన్సర్ వల్ల కుమారుడు చనిపోగా ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆపై మద్యానికి బానిసయ్యాడు. ఆఖరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువుచాలించాడు. ఈ సంఘటన సంజీవయ్యనగర్‌లో జరిగింది.
నగరంలోని గాజులరామారం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 132కేవీ లైన్ మరమ్మతుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నామని ఏఈ చైతన్యభార్గవ్ తెలిపారు.
కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని వారు టెండర్లు ఎందుకు తీసుకున్నారంటూ కాంట్రాక్టర్లపై విరుచుకుపడ్డారు.
పైరసీతో సినీ పరిశ్రమకు తవ్ర నష్టాన్ని కలిగిస్తున్న ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.