Share News

ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:38 AM

హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఇతర పనుల నిమిత్తం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

  • నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌.వి.సత్యనారాయణ(ADE L.V. Satyanarayana) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ ఎస్వీఎస్‌ టెంపుల్‌ ఫీడర్‌ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ నవభారత్‌ చాంబర్స్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌, బంజారా నగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


సైఫాబాద్‌ ఏడీఈ పరిధిలో..

సైఫాబాద్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సుధీర్‌ కుమార్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌, ఏపీఎస్పీఈబీ ఈఏ, గోశాల, హిమాయత్‌ నగర్‌ బ్రాండ్స్‌ ఫ్యాక్టరీ, లోకాయుక్త ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ కత్రియా హోటల్‌, సత్యం కంప్యూటర్స్‌, తాళ్లబస్తీ, శాంతా బాయ్‌, భారతీయ విద్యా భవన్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.


సైదాబాద్‌: టీఎస్పీడీసీఎల్‌ ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ పరిధిలోని మరమ్మతు పనుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండని డీఈ తెలిపారు. 11కేవీ శాలివాహన నగర్‌, ఫీడర్‌ పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ద్వారకాపురం, గౌతంనగర్‌ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయత్రం 5గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉందని తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌, సీ క్వార్టర్‌ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.


city1.2.jpg

సంతోష్ నగర్‌: టీఎస్పీడీసీఎల్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని 11కేవీ క్రాంతినగర్‌, కల్వంచ, మదర్‌డైరి, హుడాకాంప్లెక్స్‌, నరసింహపురి, పుష్పగార్డెన్‌, ఆల్‌ ఇండియా రేడియో, హైకోర్ట్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌, ప్యారడైజ్‌ విల్లాస్‌, ఆంధ్రకేసరి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాలలో నిర్వహణపనుల కారణంగా మంగళవారం విద్యుత్‌సరఫరా నిలిపి వేస్తున్నట్లు డీఈ తెలిపారు. 11కేవీ క్రాంతినగర్‌, కల్వంచ, మదర్‌డైరి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల, 11కేవీ హుడాకాంప్లెక్స్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, 11కేవీ నరసింహపురి, పుష్పగార్డెన్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్‌ ఉండదని తెలిపారు. 11కేవీ ఆల్‌ ఇండియా రేడియో, హైకోర్ట్‌కాలనీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, 11కేవీ భగత్‌సింగ్‌నగర్‌, ప్యారడైజ్‌ విల్లాస్‌, ఆంధ్రకేసరి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు.


ఉప్పల్‌: మరమ్మతుల కారణంగా మంగళవారం ఉప్పల్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ బి.కిరణ్‌ కుమార్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉప్పల్‌ సబ్‌ ేస్టషన్‌ పరిధిలోని 11 కేవీ ఉప్పల్‌ ఫీడర్‌ లక్ష్మారెడ్డి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ లైన్‌, సూర్యానగర్‌, హనుమ సాయినగర్‌, సరస్వతీ కాలనీ, పానేసియా ఆస్పత్రి లైన్‌ పరిసరాల్లో విద్యుత్‌ ఉండదని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయం త్రం 5.30 వరకు 11 కేవీ దేవేందర్‌ నగర్‌ ఫీడర్‌ పరిధిలోని దేవేందర్‌ నగర్‌, లక్ష్మీనారాయణ కాలనీ, బస్తీ దవాఖానా, వకీల్‌ బిల్డింగ్‌ లైన్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిపివేస్తున్నట్లు వివరించారు.


బోడుప్పల్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌ తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 33/11 కేవీ బోడుప్పల్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి వెళ్లే 11 కేవీ ఆంజనేయనగర్‌ ఫీడర్‌ పరిధిలో ద్వారకానగర్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2, కేశవనగర్‌, గాయత్రీనగర్‌, ఆంజనేయనగర్‌, ఉదా లక్ష్మీనగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 11 కేవీ బృందావన్‌ కాలనీ ఫీడ ర్‌ పరిధిలో రాఘవేంద్ర కాలనీ, బృందావన్‌ కాలనీ, సాయిమారుతీ నగర్‌, లక్ష్మీనగర్‌, కేశవనగర్‌, సిద్ధార్థ స్కూల్‌ మెయిన్‌ రోడ్‌, ఆకృతి టౌన్‌షిప్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని వెల్లడించారు.


కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా రామాలయం ఫీడర్‌ పరిధిలోని డిఫెన్స్‌ కాలనీ, నేరెడ్‌మెట్‌ చౌరస్తా, జేజేనగర్‌ పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, డిఫెన్స్‌ కాలనీ ఫీడర్‌ పరిధిలోని రామాలయం టెంపుల్‌ ఏరియా, డవున్‌ స్ట్రీట్‌ ఏరియా, పంప్‌హౌజ్‌ ఏరియాలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని సైనిక్‌పురి సబ్‌ స్టేషన్‌ ఏఈ తెలిపారు.

- ఆర్టీసీ కాలనీ ఫీడర్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జడ్‌టీఎస్‌ తిరుమలనగర్‌, హనుమాన్‌నగర్‌, కృష్ణానగర్‌, శివానందనగర్‌, పోచమ్మ టెంపుల్‌, పిల్లి నర్సింగ్‌రావునగర్‌ పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 1 వరకు, కృష్ణానగర్‌ ఫీడర్‌ పరిధిలోని మంగాపురం కాలనీ, కృష్ణానగర్‌, భక్షిగూడ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని మౌలాలి సబ్‌ స్టేషన్‌ ఏఈ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 03 , 2026 | 01:59 PM