Home » Hyderabad News
చట్టం ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశామని మల్లు రవి తెలిపారు. అసెంబ్లీలో కూడా పెట్టామని, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు.
సీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై అర్వింద్ స్పందించారు. బీసీలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవంతో రేవంత్ ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు
బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో నేడు వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించి షాక్ ఇచ్చింది.
ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ప్రతినిధి బృందం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని 'సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన సూచించారు
ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టుకు ఏజీ సుదర్శన్‌రెడ్డి వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల పాత ఉద్యోగాలు ఇచ్చి తాము ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేస్తుందని కవిత ఆరోపించారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ని స్వయంగా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఆర్టీసీపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు.
ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు పెంచింది.