Minister Ponnam Prabhakar: బీఆర్ఎస్ ఛలో బస్ భవన్‌పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:57 PM
ఆర్టీసీపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతున్న ఛలో బస్ భవన్ కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛలో బస్ భవన్ చేపట్టేవారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఛలో బస్ భవన్‌తో అనవసరమైన రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై కేసులు పెట్టిన వాళ్లు ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మాజీ సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(బుధవారం) గాంధీ భవన్‌లో మాట్లాడారు..
ఆర్టీసీపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ బకాయిలను తాము కడుతున్నామని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం గుడిని, గుడి లింగాన్ని మింగినట్టు ఆర్టీసీని పూర్తిగా ధ్వంసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం కొంత ఛార్జీలు పెంచామని పేర్కొన్నారు. ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం సిటీ బస్సుల్లో పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. రేపు(గురువారం) బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది.
Also Read:
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..
మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..
అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం