Share News

CM Revanth Reddy: అమెరికా ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ కీలక భేటీ..

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:43 PM

ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ప్రతినిధి బృందం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని 'సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన సూచించారు

CM Revanth Reddy: అమెరికా ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ కీలక భేటీ..
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణకు వచ్చిన అమెరికా హడ్సన్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇవాళ(గురువారం) సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ప్రతినిధి బృందం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని తెలిపారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన సూచించారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

ఇటీవల అమెరికా పెంచిన రాయితీలు, వీసాలపై కఠిన నిబంధనలన్నీ ఆందోళన కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Updated Date - Oct 09 , 2025 | 04:10 PM