R. Krishnaiah: హైకోర్టు ఎదుట బీసీ సంఘాల ఆందోళన.. బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నారు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:11 PM
బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ఎదుట బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. గేట్ నెం.4 దగ్గర నినాదాలు చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు..
బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తామని పేర్కొన్నారు. కొంతమంది బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. త్వరలో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆర్.కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!