Ponnam vs Adluri: మంత్రి అడ్లూరికి మహేష్ కుమార్ ఫోన్.. పొన్నంపై అడ్లూరి ఆగ్రహం
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:51 AM
పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడటం తనకురాదని తెలిపారు.
హైదరాబాద్: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మనస్పర్థలపై పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ స్పందించారు. ఈ మేరకు మీడియం సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. ఇద్దరు సమన్వయంతో కలిసి పని చేసుకోవాలని మహేష్ గౌడ్ సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నంపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా..? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.
పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడటం తనకురాదని తెలిపారు. మంత్రి వివేక్ లాగా తన దగ్గర డబ్బులు లేవని స్పష్టం చేశారు. తాను మంత్రి కావడం, ఆ సామాజిక వర్గంలో పుట్టడం తన తప్పా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తానని వివరించారు. తాను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నారని చెప్పారు. తాను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం తాను ఆదిలాబాద్ పర్యటనలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే కాంగ్రెస్ నేతలను కలుస్తానని అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..