Share News

Telangana Local Body Elections: బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ హైకోర్టు షాక్..

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:07 PM

తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో నేడు వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించి షాక్ ఇచ్చింది.

Telangana Local Body Elections: బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ హైకోర్టు షాక్..
Telangana High Court

హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇవాళ (గురువారం) బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండో రోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ 9పై స్టే విధించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైనా స్టే విధించి షాక్ ఇచ్చింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. అనంతరం రెండు వారాల్లోపు అన్ని పార్టీలు కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.


తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. అయితే, జీవో 9 విడుదల అనంతరం హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు నిన్న పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టి నేటికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ధర్మసనం.. ప్రభుత్వం తరఫు వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత.. రెండు వారాల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Updated Date - Oct 09 , 2025 | 05:01 PM