Home » Hyderabad City Police
ఒడిశాలో కిడ్నాప్‌కు గురై.. బాచుపల్లి ప్రాంతంలో బంధించి ఉన్న బాలికను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చెర నుంచి విడిపించారు. ఒడిశా రాష్ట్రం కేంద్రపడ జిల్లా సాహిర గ్రామానికి చెందిన బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి బాచుపల్లి ప్రాంతంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో నిర్బంధించారు.
మహిళలు, పిల్లల రక్షణ కోసం సైబరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని డీసీపీ సృజన కరణం పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఇంటా,బయట పిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేప్టీ వింగ్ ప్రత్యేకంగా పనిచేస్తోందన్నారు.
ఉప్పల్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్‌ను రవాణా చేసి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్స్‌ను అరెస్ట్ చేశారు.
పలువురు అమాయకులను ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో తాజాగా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల సంఖ్య 11కు చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు మహిళలే ఏజెంట్లుగా ఉన్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌కు నోటీసులు ఇవ్వడంతో బుధవారం విచారణకు హాజరయ్యారు. ప్రకాష్‌రాజ్‌ను మూడు గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
కొంచెం తక్కువ ధరకు వస్తుందని చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొంటుంటారు. అయితే, సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనేటప్పుడు ప్రజలు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచిస్తూ తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు.
బెట్టింగ్ యాప్స్ కేస్‌లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నటుడు ప్రకాష్‌రాజ్‌కి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ అధికారుల నోటీసుల మేరకు ప్రకాష్‌రాజ్ బుధవారం విచారణకు హాజరు కానున్నారు.
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో అక్రమ సరోగసీ, పిల్లల అమ్మకపు రాకెట్‌ను ఛేదించామని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆదివారం డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.