Hyderabad Metro Timings: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:37 PM
వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. స్వామి విగ్రహాలతో నిండిన భారీ వాహనాలతోనే రోడ్లు నిండిపోయాయి.
హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనాల సందర్భంగా ప్రయాణికులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) మెట్రో సమయంలో మార్పులు చేశారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఈరోజు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. నగరం వ్యాప్తంగా ప్రతిష్టించిన గణనాథులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరనున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై శోభాయాత్రలు నిర్వహిస్తూ.. భక్తులు గణనాథులను తరలించనున్నారు.
ఇప్పటికే వినాయక నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్‌లో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. స్వామి విగ్రహాలతో బయలెళ్లిన భారీ వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. మరోవైపు వినాయక నిమజ్జనం నేపథ్యంలో ప్రాధాన రహదారులను మూసివేశారు పోలీసులు. దీంతో సాధారణ పౌరులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మెట్రో రైళ్లు నడిపే సయమం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసులు ఇక కంగారుపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ అంక్షాలు కొనసాగుతున్నాయి. రేపు(ఆదివారం) ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు ఆదివారం మొత్తం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే లారీలు వంటి భారీ వాహనాలకు కూడా నగరంలోకి ఎంట్రీ ఉండదని చెప్పారు. కేవలం ఔటర్ రింగ్ రోడ్డు వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్
రికార్డు స్థాయిలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం