Heavy Rains In Hyderabad: నగర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు..
ABN , Publish Date - Sep 11 , 2025 | 07:16 PM
హయత్‌నగర్‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది.
హైదరాబాద్: నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో కొన్ని గంటల నుంచీ నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా వదర నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులని తలిపిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన.. వరదలా మారడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
హయత్‌నగర్‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. హయత్‌నగర్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు నిలవడంతో ఆటోనగర్, పెద్ద అంబర్ పేట్ వరకూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వనస్థలిపురంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎల్బీనగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్, కొత్తపేట, చైతన్యపురి, పంజాగుట్ట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం