TG News: నగరంలో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడి.. డిపోర్ట్ చేసిన అధికారులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 07:03 PM
అధికారుల సమన్వయంతో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడు మొహమ్మద్ ఉస్మాన్‌ను పంజాబ్‌లోని అటారి సరిహద్దు ద్వారా డిపోర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2011లో నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌లో ప్రవేశించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్: నగరంలో పాకిస్తానీయుడి కదలికలు కలకలం రేపాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ ఉస్మాన్ అలియాస్ ఎం.డి. అబ్బాస్ ఇక్రమ్(48) అనే పాకిస్తానీయుడు నగరంలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక అధికారులతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
అధికారుల సమన్వయంతో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడు మొహమ్మద్ ఉస్మాన్‌ను పంజాబ్‌లోని అటారి సరిహద్దు ద్వారా డిపోర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2011లో నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌లో ప్రవేశించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మొహమ్మద్ ఉస్మాన్‌పై హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ఈ కేసుల్లో 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ(బుధవారం) అతడిని పాకిస్తాన్ రేంజర్లకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..