Hyderabad News: సినిమా రేంజ్ దొంగతనం.. బ్యాంక్ ఉద్యోగులను బురిడీకొట్టించిన క్యాబ్ డ్రైవర్
ABN , Publish Date - Sep 10 , 2025 | 10:05 PM
సిటీ యూనియన్ బ్యాంక్‌కు చెందిన ఉద్యోగులు సికింద్రాబాద్ బ్యాంక్ నుంచి బాలానగర్ బ్యాంక్‌కు డబ్బులు తరలించాల్సి ఉంది. ఈ క్రమంలో ఉద్యోగులు ఓలా కారు బుక్ చేసుకున్నారు.
హైదరాబాద్: సినిమా రేంజ్‌లో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ నగరంలో దొంగతనానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే.. ప్రయాణికుల కళ్లముందే నగదు పెట్టెతో పరారయ్యాడు. ఈ ఘటన బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సిటీ యూనియన్ బ్యాంక్‌కు చెందిన ఉద్యోగులు కొందరూ.. రూ. 25 లక్షలు గల పెట్టెను ట్యాక్సీలో తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
సిటీ యూనియన్ బ్యాంక్‌కు చెందిన ఉద్యోగులు సికింద్రాబాద్ బ్యాంక్ నుంచి బాలానగర్ బ్యాంక్‌కు డబ్బులు తరలించాల్సి ఉంది. ఈ క్రమంలో ఉద్యోగులు ఓలా యాప్‌లో కారు బుక్ చేసుకున్నారు. కారు వచ్చిన అనంతరం రూ.25లక్షల నగదు ఉన్న పెట్టెతో కారులో ఎక్కారు. పెట్టెలో డబ్బు ఉన్నట్లు గుర్తించిన కారు డ్రైవర్ కాజేయాలని పన్నాగం పన్నాడు. బాలానగర్ దగ్గర బ్యాంక్ ఉద్యోగులు.. కారులో నుంచి దిగి పెట్టెను తీస్తున్నారు. అదే అదునుగా అనుకున్న కారు డ్రైవర్ కారును ఫాస్ట్‌గా ముందుకు పోనిచ్చి పెట్టెతో ఉడాయించాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా బ్యాంక్ ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. వెంటనే షాక్ నుంచి తెరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..