Hyderabad Robbery: రెచ్చిపోయిన దుండగులు.. వ్యాపారిని బెదిరించి ఏకంగా.. బాబోయ్..
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:28 PM
శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన స్టీల్ వ్యాపారిని బెదిరించి రూ.40 లక్షలను దుండగులు లాకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. డబ్బుతో పారిపోతుండగా కొత్తపల్లి వద్ద దుండగుల వాహనం బోల్తాపడినట్లు పేర్కొన్నారు.
రంగారెడ్డి: తెలంగాణలో క్రైమ్ రేటు తక్కువగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నా నగరంలో నేరాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, భద్రతా చర్యలు చేపట్టినా నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఓ చోట అక్రమార్కులు తమ పనితనాన్ని చూపెడుతూనే ఉన్నారు. తాజాగా.. నగరంలోని శంకర్ పల్లి మున్సిపాలిటీలో మరోసారి అక్రమార్కులు రెచ్చిపోయారు.
పోలీసుల కథనం ప్రకారం.. శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన స్టీల్ వ్యాపారిని బెదిరించి రూ.40లక్షలను దుండగులు లాకున్నారు. అయితే.. డబ్బుతో పారిపోతుండగా కొత్తపల్లి వద్ద దుండగుల వాహనం బోల్తాపడినట్లు పేర్కొన్నారు. దీంతో కొంత నగదు అక్కడే వదిలేసి పారిపోయినట్లు చెప్పారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నట్లు వివరించారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు