Home » Hyderabad City Police
తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ మెహదీపట్నం, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పరిసరాల్లో మే 24, 25 తేదీల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్కైవాక్ పనుల నేపథ్యంలో పోలీసులు ప్రకటించిన పూర్తి రూట్ మ్యాప్, హెల్ప్‌లైన్ నంబర్ వివరాలు వెల్లడించారు.
ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశాన్ని పట్టి పీడిస్తున్న నక్సల్స్ తీవ్రవాదానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ పోలీస్ అధికారులను ప్రత్యేకంగా అమిత్ షా అభినందించారు.
తెలుగు సినీ పరిశ్రమను మరోసారి కలవరపెడుతూ ‘ఐ బొమ్మ’ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ ఫిలిం ఛాంబర్ ఆదివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్‌ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పేట్ బషీరాబాద్ పోలీసులకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఓ లేఖ పంపించారు. బుధవారం మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మే 15వ తేదీన విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడి కేసులో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.