Hyderabad Ganja Seized: అబ్దుల్లాపూర్ మెట్‌లో రూ. 6 కోట్ల గంజాయి పట్టివేత..
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:49 PM
అబ్దుల్లాపూర్ మెట్‌లో భారీగా గంజాయిను పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్టు, కొత్తగూడ వద్ద తనిఖీ చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్: మత్తుపదార్థాల నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన వాటిని పూర్తిగా.. అరికట్టలేకపోతోంది. దుండగులు ఎక్కడో ఓ చోట అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా కొనసాగిస్తూ.. భావితరాల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుంది. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకున్న మాదకద్రవ్యాల వ్యాపారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఈగల్ టీమ్ పోలీసులు ఇతర అధికారుల సహకారంతో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేస్తూ.. మాదకద్రవ్యాల రవాణాను చాల వరకు అడ్డుకున్నారని చెప్పవచ్చు. ఈ మేరకు ఈగల్ టీమ్ చేపట్టిన దాడుల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాజాగా మరోసారి నగరంలో భారీగా గంజాయి పట్టిబడింది. అబ్దుల్లాపూర్ మెట్‌లో భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నట్లు SOT రాచకొండ పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్‌లో భారీగా గంజాయిను పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్టు, కొత్తగూడ వద్ద తనిఖీ చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దుండగులు అతి తెలివితో.. DCM వ్యానులో సిమెంట్ బ్యాగుల చాటున గంజాయి దాచినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా.. DCMను తనిఖీ చేయగా.. ఆ సిమెంట్ బ్యాగుల మధ్య 1210 కిలోల గంజాయిను గుర్తించినట్లు పేర్కొన్నారు. గంజాయి విలువ సుమారుగా రూ.6 కోట్లుగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, DCMను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం