CP Sajjanar: సీపీ సజ్జనార్ హెచ్చరిక.. సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 07:08 AM
చేతిలో సెల్‌ఫోన్, చెవిలో ఇయర్‌ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వాహనదారులను హెచ్చరించారు.
- వాహనదారులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక
- ఇకపై సిటీ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సిటీ: చేతిలో సెల్‌ఫోన్, చెవిలో ఇయర్‌ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(City Police Commissioner VC Sajjanar) వాహనదారులను హెచ్చరించారు. కొంతమంది ఆటో, క్యాబ్, మినీ లారీల డ్రైవర్ల తీరు మరీ దారుణం. గూగుల్ మ్యాప్‌లు(Google Maps), వీడియోలు చూస్తూ రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నారు. పక్కన వచ్చే వాహనదారులను పట్టించుకోకుండా ఒక చేతిలో సెల్‌ఫోన్, మరొక చేతిలో స్టీరింగ్ పట్టుకొని కార్లు, బైక్‌లు నడుపుతున్నారు.

బైక్ రైడర్లు, స్విగ్గీ, జొమాటో, ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ డ్రైవింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సెల్‌ఫోన్ మాట్లాడకుండా, గూగుల్ మ్యాప్‌ను చూడకుండా డ్రైవింగ్ చేసే పరిస్థితిలేదంటే అతిశయోక్తికాదు. సెల్‌ఫోనే లోకంగా వాహనాలు నడుపుతున్న కొందరు వాహనదారులు రోడ్డుపై ఉన్న గుంతలను ముందు వెళ్తున్న వాహనాలు పట్టించుకోవడంలేదు. దాంతో రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. సో.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసే వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa