Share News

Madannapet Murder Case: వీడిన బాలిక హత్య మిస్టరీ.. నిందితులుగా తేలిన మేనమామ, అత్త

ABN , Publish Date - Oct 04 , 2025 | 08:58 PM

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు. బాలిక ఆచూకీ కోసం సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులను పరిశీలించామని చెప్పారు.

Madannapet Murder Case: వీడిన బాలిక హత్య మిస్టరీ.. నిందితులుగా తేలిన మేనమామ, అత్త
Madannapet Murder Case

హైదరాబాద్: మాదన్నపేట బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. మేనమామ, అత్త కలిసి ఏడేళ్ల బాలికను కిరాతకంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు, కాళ్లు కట్టేసి వాటర్‌ ట్యాంక్‌లో పడేసినట్లు పేర్కొన్నారు. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసినట్లు చెప్పారు. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆస్తి పంపకాల విషయంలోని గొడవల కారణంగా హత్య చేసినట్లు స్పష్టం చేశారు.


ఈ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. బాలిక ఆచూకీ కోసం సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులను పరిశీలించామని చెప్పారు. బయటి వాళ్లు కిడ్నాప్ చేసిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని తెలిపారు. బాలిక మృతికి కుటుంబసభ్యులు కారణం కావొచ్చని భావించి అందరినీ విచారణ చేసినట్లు వివరించారు. విచారణలో భాగంగా ఏడేళ్ల బాలికను కిరాతకంగా మేనమామ సమీ అలీ, అత్త యాస్మిన్ బేగం హత్యచేసినట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు.


సమీ అలీ, యాస్మిన్ బేగం దంపతుల కుమార్తె గతంలో మృతి చెందిందని డీసీపీ తెలిపారు. తమ కూతురి మృతిని తట్టుకోలేక చేతబడి చేశారనే అనుమానంతో ఉన్న అలీ దంపతులు బాలికను హత్య చేశారని పేర్కొన్నారు. అలాగే బాలిక ప్రతి రోజు ఇంట్లో ఆడుకుంటుండడాన్ని నిందితులు జీర్ణించుకోలేక అల్లరి చేస్తుందన్న కోపంతో మరింత కక్ష పెంచుకున్నారని వివరించారు.

బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వాటర్‌ ట్యాంక్‌లో మేనమామ పడేశారని, బాలిక నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటి కప్పి ఊపిరాడకుండా చేశారని పేర్కొన్నారు. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయన్నారు. అవన్ని మనసులో పెట్టుకుని బాలికను హత్య చేశారని అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Updated Date - Oct 04 , 2025 | 09:14 PM