Miss World at Bathukamma: మహా బతుకమ్మ వేడుకల్లో.. మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు
ABN , Publish Date - Sep 29 , 2025 | 09:51 PM
తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి.. చరిత్ర సృష్టించాయి.
హైదరాబాద్: సరూర్‌నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ మేరకు మహా బతుకమ్మ రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. ఈ బతుకమ్మ వేడుకలకు మిస్ వరల్డ్ ముద్దుగుమ్మలు హాజరై.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. థాయ్‌లాండ్‌కు చెందిన మిస్ వరల్డ్ ఒపాల్ సుచత చువాంగ్ పాల్గొని బతుకమ్మను వేడుకలను తిలకించారు. అనంతరం మంత్రి సీతక్కతో కలిసి అందాల భామలు బతుకమ్మ ఆడారు. ఈ మేరకు మిస్ వరల్డ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కల్చర్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.
కాగా, తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి.. చరిత్ర సృష్టించాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం 10 వేల మందితో బతుకమ్మ వేడుకను ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో మహా బతుకమ్మ కార్యక్రమం ఏకంగా రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది. అతిపెద్ద జానపద నృత్యంగా తెలంగాణ బతుకమ్మ ఒక గిన్నిస్ రికార్డు సాధించింది. మరో రికార్డుగా 66.5 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ ఒకేసారి 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్