Share News

Vishwanath Chennappa Sajjanar: సీపీ వార్నింగ్.. తప్పుచేసే అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయ్

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:44 AM

విధినిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచే సిబ్బందిని ప్రోత్సహిస్తామని, తప్పు చేస్తే సహించబోమని వారిపై చర్యలుంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా సోమవారం మాదన్నపేట పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మిక తనిఖీ చేశారు.

Vishwanath Chennappa Sajjanar: సీపీ వార్నింగ్.. తప్పుచేసే అధికారులు, సిబ్బందిపై చర్యలుంటాయ్

- మాదన్నపేట ఠాణాలో సీపీ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్: విధినిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచే సిబ్బందిని ప్రోత్సహిస్తామని, తప్పు చేస్తే సహించబోమని వారిపై చర్యలుంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌(VC Sajjanar) హెచ్చరించారు. పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా సోమవారం మాదన్నపేట పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మిక తనిఖీ చేశారు. పీఎస్‌ రికార్డులు పరిశీలించారు. వివిధ కేసుల పురోగతి, పోలీసింగ్‌ విధానాలు, సామాజిక, మత సమస్యలు, ఇతర ఆంశాలను సీపీ సమీక్షించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే కేసు నమోదు చేసి, చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలన్నారు. నగరంలో పీపుల్స్‌ వెల్ఫేర్‌ పోలీసింగ్‌ ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ విధానం నగర ప్రజల భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు చురుకైన విచారణ చేసి నిందితులను అరెస్ట్‌ చేయడంతో బాధిత తండ్రి కమిషనర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.


city9.2.jpg

అనంతరం కమిషనర్‌ మాదన్నపేట పీఎస్‌ పరిధిలో సున్నిత ప్రాంతాలను సందర్శించి పోలీస్‌ పికెట్లు, సీసీ కెమెరాల పనితీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ సీపీ(లాఅండ్‌ అర్డర్‌) తప్సీర్‌ ఇక్బాల్‌, డీసీపీ(స్పెషల్‌ బ్రాంచ్‌) అపూర్వరావు, సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చైతన్య కుమార్‌, సైదాబాద్‌ ఏసీపీ సోము వెంకట్‌రెడ్డి, మాదన్నపేట ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, శ్రీనునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ రాజకీయం

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 07 , 2025 | 11:44 AM