Mother Killed by Daughter: టాబ్లెట్‌లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి...
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:05 PM
ఎస్సార్ నగర్‌లో ఓ కూతురు తన తల్లి టాబ్లెట్‌లు వేసుకోలేదని రాడ్డుతో కొట్టి చంపింది. మృతి చెందిన తల్లి వయసు 90 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో మానవతా విలువలకు మనుషులు దూరమవుతున్నారు. మన, తన అనే తేడాలు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. దేని కోసం ఎందు కోసం చేస్తున్నారో తెలియకుండానే.. కన్న వారిని, కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఒకటి నగరంలో చోటుచేసుకుంది. ఎస్సార్ నగర్‌లో ఓ కసాయి కూతురు కన్నతల్లిని కడతేర్చింది. ఇనుప రాడ్డుతో తల్లిపై అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఎస్సార్ నగర్‌లో ఓ కూతురు తన తల్లి టాబ్లెట్‌లు వేసుకోలేదని ఇనుపరాడ్డుతో కొట్టి చంపింది. మృతి చెందిన తల్లి వయసు 90 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. హత్య చేసిన నిందితురాలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వివరించారు. ఈ మేరకు కూతుర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం