Home » Hyderabad City Police
'ఇవ్వాలా బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపట ఎక్కడున్నారో కొద్ది చెప్తారా కిషన్ రెడ్డి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదు. నేను హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడుతాను.'
ప్రభాత్‌ను గదిలో బంధించిన స్నేహితులు.. బీర్ బాటిళ్లు, కేబుల్ వైర్లు, కట్టెలతో విచక్షణ రహితంగా చిత్ర హింసలకు గురి చేశారు. ప్రభాత్ అపస్మారక స్థితికి చేరుకున్న తరువాత తెల్లవారు జామున ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు.
ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.
ఆక్షన్‌లో పాల్గొంటున్న వారిపై నౌహీరా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నౌహీరా చర్యలపై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి సాయిలక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
దుండగులను ప్రొఫెషనల్ దొంగతనాలకు పాల్పడే వ్యక్తులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజ్ సిబ్బందిని సైతం విచారించినట్లు తెలిపారు. ఈనెల 10న గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు.
చేతిలో సెల్‌ఫోన్, చెవిలో ఇయర్‌ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వాహనదారులను హెచ్చరించారు.
విధినిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచే సిబ్బందిని ప్రోత్సహిస్తామని, తప్పు చేస్తే సహించబోమని వారిపై చర్యలుంటాయని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా సోమవారం మాదన్నపేట పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మిక తనిఖీ చేశారు.
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు. బాలిక ఆచూకీ కోసం సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులను పరిశీలించామని చెప్పారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పింకీ(17) ఆత్మహత్యకు పాల్పడింది. పింకీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.