Home » High Court
పవన్ కల్యాణ్ 'OG' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది. 'OG' సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ..
సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో లోకల్ అభ్యర్థి గుర్తింపు వివాదాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వనపర్తి జిల్లా విద్యార్థి శశికిరణ్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.
జెండా స్తంభాల తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మద్రాసు హైకోర్టు ప్రశంసించింది. రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, ప్రైవేటు స్థలాల్లో రాజకీయ పార్టీలు, మత, కుల సంఘాలు ఏర్పాటుచేసిన జెండా స్తంభాలు తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం జనవరిలో ఉత్తర్వులు జారీచేసిన విషం తెలిసిందే.
స్పోర్ట్స్ అథారిటీ అవసరమైన రీవెరిఫికేషన్ లిస్టులు ఇవ్వకపోవడం వల్లే ఈ ఆలస్యం జరిగిందని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల రీవెరిఫికేషన్ లిస్టును ఇవ్వాలని పలుమార్లు స్పోర్ట్స్ అథారిటీకి లేఖలు రాసినట్లు ఆయన ఆధారాలను సమర్పించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నంజేగౌడ గెలుపును బీజేపీ అభ్యర్థి కేఎస్ మంజునాధ్ గౌడ హైకోర్టులో సవాలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఫలితాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత కల్పించాలని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ హయాంలో పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత ఉండేది. వైసీపీ అధికారం చేపట్టాక టీడీపీ నేతలను టార్గెట్ చేసింది.
బాను ముస్తాక్ కొన్ని నెలల క్రితం హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని పిటిషనర్లు వాదించారు. దసరా ప్రారంభోత్సవంలో చాముండేశ్వరి దేవత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని, వేదాలను పఠించాలని తెలిపారు.
గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై TGPSC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారం రోజుల్లో TGPSC పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.