Telangana High Court: మహేశ్వరం మండలం నాగారం భూములపై హైకోర్టు విచారణ
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:47 PM
మహేశ్వరం మండలం నాగారం భూములపై హైకోర్టులో విచారణ జరిగింది. బిర్ల మహేశ్ అనే పిటిషనర్ దాఖలు చేసిన ఈ భూములపై ప్రభుత్వ స్పందనను న్యాయస్థానం పరిశీలించింది.
హైదరాబాద్: మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామానికి చెందిన వివాదాస్పద భూముల విషయంపై హైకోర్టులో విచారణ జరగింది. బిర్ల మహేశ్ అనే పిటిషనర్ దాఖలు చేసిన కేసులో ఈ భూములపై ప్రభుత్వ స్పందనను న్యాయస్థానం పరిశీలించింది. సర్వే నంబర్ 194లో 383 ఎకరాలు, 195లో 370 ఎకరాలు ఉన్నాయని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది మురళీధర్ రెడ్డి తెలిపారు.
అయితే, వీటిలో కేవలం 95.24 ఎకరాలు మాత్రమే నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని చెప్పారు. మిగిలిన భూములన్నీ పట్టా భూములు అని స్పష్టం చేసిన జనరల్ ప్లీడర్, నిషేధిత భూములపై ఇప్పటివరకు ఎలాంటి లావాదేవీలు జరగలేదని కోర్టుకు వెల్లడించారు. కానీ, పిటిషనర్ బిర్ల మహేశ్ తన పిటిషన్‌లో, నిషేధిత భూములకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పట్టాలు ఇచ్చారంటూ ఆరోపించారు.
ఈ క్రమంలో పట్టాలు మంజూరు చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. పరిస్థితిని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి, ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
Also Read:
వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
For More Latest News