High Court: హుక్కా వినియోగదార్లకు పరీక్షలు చేస్తున్నారా?
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:38 AM
హుక్కా కేంద్రాలపై దాడులు చేసి కేసులతో వదిలేస్తున్నారా? వినియోగదార్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.
కేవలం తనిఖీలతో సరిపెడుతున్నారా?
పోలీసులకు హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): హుక్కా కేంద్రాలపై దాడులు చేసి కేసులతో వదిలేస్తున్నారా? వినియోగదార్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. హుక్కా వినియోగదార్లకు ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తున్నారా అని అడిగింది. తమ వ్యాపార కార్యకలాపాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ మాదాపూర్ గుట్టల బేగంపేటలోని స్మోకీ టేల్స్ కేఫ్ అండ్ గ్రిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం పోలీసులకు ఈ ప్రశ్నలు వేసింది. హుక్కా సెంటర్లపై దాడులకు సంబంధించిన వివరాలు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.