Hyderabad Demolition: జూబ్లీ ఎన్‌క్లేవ్ కూల్చివేతలపై హైడ్రాకు షాక్!
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:35 AM
జూబ్లీ ఎన్‌క్లేవ్ కూల్చివేతలపై హైడ్రాకు షాక్ తగిలింది. అక్కడ హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆ స్థలాన్ని వెంటనే ఖాళీ చేయండి.. బోర్డులూ తీసేయండి
ప్రాథమిక రికార్డులను బట్టి ప్రైవేటు స్థలం అని అర్థమవుతోంది
తదుపరి ఉత్తర్వులిచ్చే దాకా ఎలాంటి జోక్యం చేసుకోవొద్దు: హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జూబ్లీ ఎన్‌క్లేవ్ కూల్చివేతలపై హైడ్రాకు షాక్ తగిలింది. అక్కడ హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో సర్వే నంబరు 66, 67లో హైడ్రా స్వాధీనం చేసుకున్న 2వేల చదరపు గజాల స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం అంటూ అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని స్పష్టం చేసింది. ప్రాథమికంగా రికార్డులు పరిశీలిస్తే ఆ స్థలం ప్రైవేటుదని అర్థమవుతోందని.. తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు ఆ స్థలంలో జోక్యం చేసుకోరాదంటూ.. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పురపాలక శాఖ, జూబ్లీఎన్‌క్లేవ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లకు హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కాగా జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కునను అక్రమించి.. నిర్మాణాలు చేపట్టారంటూ అక్కడి ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో ఈనెల 23న హైడ్రా అక్కడ కూల్చివేతలు చేపట్టింది. ఆ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి.. స్వాధీనం చేసుకున్నట్లుగా బోర్డులు పెట్టింది. అయితే తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని, ఇది అక్రమం అంటూ యజమానులు వెంకటరెడ్డి, జగాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని హైడ్రాకు మధ్యంతర ఉత్తర్వుల్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..