Himachal Pradesh High Court: వేరే దేశాన్ని పొగడడం నేరం కాదన్న హిమాచల్ హైకోర్టు
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:17 AM
స్వదేశంపై ఎలాంటి విమర్శలు చేయకుండా, వేరే దేశాన్ని పొగిడినంత మాత్రాన అది నేరం కిందికి రాదని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
సిమ్లా, ఆగస్టు 23: స్వదేశంపై ఎలాంటి విమర్శలు చేయకుండా, వేరే దేశాన్ని పొగిడినంత మాత్రాన అది నేరం కిందికి రాదని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది తిరుగుబాటు, హింస, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినట్టు కాదని పేర్కొంది. ప్రధాని మోదీ ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటున్నట్టుగా కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు అరెస్టయిన వీధి వ్యాపారికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. వ్యాపారి మాతృభూమిని ఏ మాత్రం కించపరచలేదని, కేవలం వేరే దేశాన్ని పొగుడుతూ పోస్టును షేర్ చేశాడని, ఇలాంటి పరిస్థితుల్లో రాజద్రోహం కేసు వర్తించదని న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కైంతల అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
బిల్లు నుంచి తనను మినహాయించేందుకు ఒప్పుకోని మోదీ
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News