Telangana High Court: ఆ కేబుల్ వైర్లు తొలగించండి.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 07:58 PM
విద్యుత్ స్తంభాలపై అమర్చిన ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగింపుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనుమతి లేని కేబుల్ వైర్లను తొలగించాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్: నగరంలోని విద్యుత్ స్తంభాలపై అమర్చిన ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగింపు అంశంపై ఇవాళ(సోమవారం) హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల రామంతాపూర్‌లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ సమస్యపై దృష్టి సారించారు అధికారులు. విచారణలో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు.
ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను అధికారులు తొలగించడం ప్రారంభించారు. అయితే, అనుమతులు పొందిన కేబుళ్లను కూడా తొలగిస్తున్నారని ఎయిర్ టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అనుమతి తీసుకున్నా వైర్లు తొలగిస్తున్నారని సదరు సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
అయితే, అనుమతి పొందిన స్తంభాల వివరాలను సమర్పించాలంటూ టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం, అనుమతి లేకుండా అమర్చిన కేబుళ్లను తొలగించాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
Also Read:
కీలక నేతను సస్పెండ్ చేసిన జనసేన అధిష్టానం
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన కేంద్రం..
ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
For More Latest News