Share News

Jana Sena Leader Karri Mahesh Suspends: కీలక నేతను సస్పెండ్ చేసిన జనసేన అధిష్టానం

ABN , Publish Date - Aug 25 , 2025 | 07:18 PM

మచిలీపట్నంలో హోంగార్డ్‌పై జనసేన నేత కర్రి మహేష్‌ దాడి చేశాడు. ఈ ఘటనపై జనసేన అధిష్టానం చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన కర్రి మహేష్‌పై సస్పెన్షన్ వేటు వేసింది.

Jana Sena Leader Karri Mahesh Suspends: కీలక నేతను సస్పెండ్ చేసిన జనసేన అధిష్టానం
Jana Sena Leader Karri Mahesh Suspends

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో హోంగార్డ్‌పై జనసేన నేత కర్రి మహేష్‌ దాడి (Jana Sena Leader Karri Mahesh) చేశాడు. ఈ ఘటనపై జనసేన అధిష్టానం చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన కర్రి మహేష్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. జనసేనలో కర్రి మహేష్ క్రియాశీలక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ తెలిపారు.


ఈ ఘటనపై బండి రామకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిజానిజాలు పూర్తిగా తెలియకపోయినా కేసు నమోదైన నేపథ్యంలో కర్రి మహేశ్ క్రియాశీలక సభ్యత్వాన్ని పార్టీ హైకమాండ్ రద్దు చేసిందని తెలిపారు. పార్టీకి నష్టం చేకూర్చే వాళ్లంటే తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ఇష్టం ఉండదని చెప్పుకొచ్చారు.


ప్రజలకు సేవ చేయాలని పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో తామంతా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పని చేస్తున్నామని ఉద్ఘాటించారు. జనసేన పార్టీకి నష్టం చేకూర్చే వాళ్లపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నారా లోకేష్.. స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు : పల్లా శ్రీనివాసరావు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

For More AP News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 07:27 PM