Facial Recognition: 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ ప్రారంభం
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:45 AM
రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు విధానం (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్-ఎ్‌ఫఆర్‌ఎస్) శనివారం ప్రారంభమైంది.
63,587 మంది విద్యార్థుల రిజిస్ర్టేషన్ పూర్తి
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు విధానం (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్-ఎఫ్‌ఆర్‌ఎస్) శనివారం ప్రారంభమైంది. ఇంటర్ విద్యలో ఇది డిజిటల్ దిశగా కీలక ముందడుగు అని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 1,64,621 మంది విద్యార్థుల్లో 63,587 మంది విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ రిజిస్ర్టేషన్ పూర్తయిందని, మిగిలిన వారికి సోమవారం పూర్తి చేయనున్నట్టు ఇంటర్ విద్య సంచాలకుడు కృష్ణ ఆదిత్య తెలిపారు. కేవలం 10 సెకన్లలోనే హాజరు పూర్తవుతుందని, గైర్హాజరైన విద్యార్థి వివరాలు వెంటనే వారి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా వెళ్తుందన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విజయవంతానికి ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News